వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తేజ సజ్జ “అద్భుతం”

Published on Jan 6, 2022 11:17 pm IST


తేజ సజ్జ హీరోగా, శివాని రాజశేఖర్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం అద్బుతం. ఈ చిత్రం డైరెక్ట్ డిజిటల్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖుల నుండి, ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్దం అయ్యింది.

బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి ఈ చిత్రం సంక్రాంతి పండుగ కి వస్తోంది. స్టార్ మా మూవీస్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం రానుంది. ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథ అందించగా, రధన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :