మహేష్ “సర్కారు వారి పాట” కోసం మరో సెన్సేషన్!

Published on May 27, 2022 7:00 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం కి మరో సెన్సేషన్ యాడ్ అవుతున్నట్లు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

అయితే ఈ చిత్రం లో మరో సెన్సేషన్ సాంగ్ ను యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అతని ఫేవరేట్ అంటూ చెప్పుకొచ్చారు థమన్. సెలబ్రేషన్స్ మళ్ళీ మొదలు అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, నదియా, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సముద్ర ఖని, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :