ఆర్సీబీ జెర్సీలో అధీరా, రమీకా సేన్.. పిక్స్ వైరల్..!

Published on Apr 20, 2022 1:22 am IST

ఇటీవల విడుదలైన కేజీఎఫ్ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పవర్ ఫుల్ విలన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక మరో నటి రవీనా టాండన్ ప్రధాన మంత్రిగా రమీకా సేన్ పాత్రలో నటించింది. అయితే ప్ జరుగుతున్న ఈ ఐపీఎల్ మ్యాచ్‌కి కేజీఎఫ్ చిత్ర బృందం హాజరయ్యింది.

అయితే ఈ రోజు సాయంత్రం బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ గియాంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో సంజయ్ దత్ మరియు రవీనా టాండన్‌లు ఇద్దరు మెరిశారు. ఆర్సీబీ జెర్సీల్లో స్టాండ్స్‌లో సందడి చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రొడక్షన్ హౌజ్ అయిన హోంబలే ఫిల్మ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో అసోసియేట్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :