అజిత్ సినిమాలో అధీరా కీలక పాత్ర.?

Published on Jul 28, 2022 1:10 pm IST


సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోలలో అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి తాను నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “వలిమై” సూపర్ హిట్ అయ్యింది. అంతే కాకుండా తెలుగులో కూడా ఈ చిత్రం డీసెంట్ వసూళ్లు అందుకుంటుంది. ఇక నెక్స్ట్ కూడా ఈ చిత్ర దర్శకుడు హెచ్ వినోద్ తోనే తన కెరీర్ లో 61వ సినిమాని అజిత్ చేస్తుండగా దీనిని కూడా మేకర్స్ ఒక సూపర్ స్టైలిష్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు కూడా బయటకి వచ్చి వైరల్ అవుతుండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది. ఈ చిత్రంలో కీలక పాత్రకి గాను కేజీయఫ్ ఫేమ్ అధీరా, బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనితో బహుశా ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారేమో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని కూడా బోణి కపూర్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :