విక్రమ్ “కోబ్రా” నుండి రేపు అధీర తెలుగు లిరికల్ సాంగ్ విడుదల

Published on Jul 17, 2022 6:00 pm IST


వెర్సటైల్ యాక్టర్ విక్రమ్ తర్వాత కోబ్రా సినిమాలో కనిపించనున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫ్రాంచైజీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక. ఇప్పుడు వార్త ఏమిటంటే, తెలుగు వెర్షన్ అధీర లిరికల్ సాంగ్ రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది మరియు దానిని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇంతకుముందు విడుదలైన తమిళ వెర్షన్‌కు విశేష స్పందన లభించింది. దాంతో ఈ తెలుగు వెర్షన్ ర్యాప్ సాంగ్ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. కోబ్రాలో ఇర్ఫాన్ పఠాన్, మృణాళిని రవి, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :