వైష్ణో దేవిని సందర్శించిన “ఆదిపురుష్” మేకర్స్!

Published on Mar 28, 2023 5:00 pm IST

పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మైథాలజికల్ మూవీ ఆదిపురుష్. ఈ చిత్రం లో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది. టీ సిరీస్ ఫిల్మ్స్ మరియు రెట్రోఫైల్స్ లపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ – అతుల్ లు సంగీతం అందిస్తున్నారు. జూన్ 16, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే నేడు నిర్మాత భూషణ్ కుమార్ మరియు డైరెక్టర్ ఓం రౌత్ లు వైష్ణో దేవిని సందర్శించారు. అందుకు సంబంధించిన ఒక ఫోటో ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఆదిపురుష్ చిత్రం కి బ్లెస్సింగ్స్ కోసం మేకర్స్ విచ్చేసినట్లు తెలుస్తోంది. 3డీ లో రిలీజ్ కానున్న ఈ భారీ బడ్జెట్ మూవీ లో సైఫ్ అలీఖాన్ రావణాసురుని పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :