ఇంటర్వ్యూ : ఆది సాయి కుమార్ – “టాప్ గేర్” అందుకే నచ్చి చేశాను

ఇంటర్వ్యూ : ఆది సాయి కుమార్ – “టాప్ గేర్” అందుకే నచ్చి చేశాను

Published on Dec 27, 2022 4:49 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది లోనే పలు సినిమాలు చేసి ఆడియెన్స్ ని పలకరించిన తాను ఇప్పుడు “టాప్ గేర్” అనే మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో కే వి శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా ఆది సాయి కుమార్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

ఈ ఒక్క ఏడాది మూడు సినిమాలు వచ్చాయి.. దీనిపై మీ స్పందన ఏంటి?

కరోనా వల్ల అన్ని సినిమాలు ఆలస్యమయ్యాయి. అందుకే అన్నీ ఒకే సారి వస్తున్నాయి. ఇక సమ్మర్ సీజన్‌లో పెద్ద సినిమాలు రావడంతో డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. చిన్న సినిమాలకు ప్రస్తుతం డేట్స్ దొరకడం కష్టంగా మారింది. అందుకే ఈ ఏడాదిలో నా నుంచి మూడు చిత్రాలు వచ్చాయి.

 

చెప్పండి టాప్ గేర్ సినిమా కథలో ఏ అంశం నచ్చింది? సినిమాను ఎందుకు ఎంచుకున్నారు?

టాప్ గేర్ కథ నాకు బాగా నచ్చింది. క్యాబ్ డ్రైవర్‌.. అతని జీవితంలో చిన్న సమస్య.. అది పెద్దగా మారడం.. ఒక్క రోజులో ఈ కథ జరుగుతుంది.. మా టీం అందరికీ ఈ కథ నచ్చింది. అందుకే ఈ సినిమాను చేశాం.

 

టాప్ గేర్ టైటిల్‌ ఆసక్తికరంగా ఉంది. ఈ ఆలోచన ఎవరిది?

టాప్ గేర్‌ అనే టైటిల్‌ను ముందుగా అనుకోలేదు. కానీ హీరో కారెక్టర్ మాత్రం టాప్ గేర్‌లోనే ఉంటుంది. హీరో టాప్ గేర్ వేయాల్సి వస్తుంది. ఒకసారి టాప్ గేర్ అని అనుకున్నాం. చాలా స్టైలిష్ ‌గా ఉందని ఆ టైటిల్‌ను ఫిక్స్ చేశాం.

 

డైరెక్టర్ కోసం చెప్పండి?

డైరెక్టర్ శశికాంత్ చూస్తే ఓ ప్రొఫెసర్‌లా ఉంటారు. కానీ చాలా క్లారిటీతో ఉంటాడు. సీనియర్ డీఓపీ సాయి శ్రీరామ్ కి కూడా ఆ షాట్ అలా తీద్దాం ఇలా తీద్దామని చెబుతుండేవాడు. చాలా క్లారిటీతో ఉండేవాడు. ఎడిటర్ ప్రవీణ్ పూడి సైతం కంటెంట్ చాలా బాగుందని, బాగా తీశారని అన్నాడు.

 

టాప్ గేర్ సినిమాలో ఫైట్స్ కీలకంగా మారేలా ఉన్నాయి. ఫైట్ మాస్టర్‌ గురించి చెప్పండి?

రొమాంటిక్ సినిమాతో ఫైట్ మాస్టర్ పృథ్వీకి మంచి బ్రేక్ వచ్చింది. ఎంతో సహజంగా ఫైట్‌లను కంపోజ్ చేస్తుంటాడు. ఫైట్‌లో కూడా కథను చెప్పాలని చూస్తాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తెల్లవారుఝామున నాలుగు గంటలకు ఓ సీన్ చేశాం. ఆ టైంలో యాక్సిడెంట్‌ కూడా జరిగింది. ఈ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్‌ అంతా కూడా రాత్రే షూటింగ్ చేశాం.

 

సంగీత దర్శకుడు కోసం చెప్పండి

టాప్ గేర్ సినిమాకు ఆర్ఆర్ చాలా ముఖ్యం. హర్షవర్దన్ రామేశ్వర్ మాకు అద్భుతంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఆయన అంతకు ముందు ఆర్జున్ రెడ్డి చేశాడు. ప్రస్తుతం రవితేజ రావణాసుర, యానిమల్ సినిమాలు చేస్తున్నాడు. టాప్ గేర్ సినిమా బాగుందని ఆయన కూడా అన్నారు. సినిమాలో ఒకే ఒక్క పాట ఉంటుంది.

 

ఎక్స్పెరిమెంటల్ సినిమాలపై మీ అభిప్రాయం చెప్పండి?

కొత్త కథలు చేయాలని, ప్రయోగాలు చేయాలని ఉంటుంది. ప్రస్తుతం నేను ఒక వెబ్ సిరీస్‌ చేస్తున్నాను. జీ5 కోసం నేను చేయబోతున్న వెబ్ సిరీస్‌లో ఎవ్వరూ ఊహించనటువంటి పాత్రను పోషిస్తున్నాను. కానీ నా వద్దకు వచ్చే కథలన్నీ కమర్షియల్ యాంగిల్‌లోనే ఉంటాయి. కానీ నాకు రియలిస్టిక్ సినిమాలు చేయాలని ఉంటుంది.

 

విలన్ కూడా నటించే ఛాన్స్ ఉందా?

నెగెటివ్ రోల్స్‌ ఆఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు హీరోగా మంచి చిత్రాలు చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ కూడా చకాచకా చిత్రాలు చేసేయాలని అనుకుంటున్నాను.

 

హీరోయిన్‌ రియాతో వర్క్ కోసం చెప్పండి?

రియాకు నాకు సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఆమె ప్రస్తుతం తమిళంలో బిజీగా ఉన్నారు. నయనతార ప్రొడక్షన్ కంపెనీలో సినిమా చేస్తోంది. ఆమెతో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో చక్కగా నటించింది.

 

టాప్ గేర్ సినిమాను ఇతర భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారా?

టాప్ గేర్ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. హిందీలో డబ్ చేస్తున్నాం. గరం సినిమాతో నార్త్‌లో బాగానే క్రేజ్ వచ్చింది. లవ్ లీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ హిందీ ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకున్నాయి.

 

మీ మాస్ ఇమేజ్‌ను చూసి నిర్మాతలు ముందుకు వస్తున్నారా? లేక కంటెంట్ చూసి వస్తుంటారా?

మంచి కంటెంట్‌ ఉంటేనే నిర్మాతలు ముందుకు వస్తారు. నా ప్రతీ సినిమా టెక్నికల్‌గా బాగా ఉంటుంది. నా చిత్రాలు ఓటీటీలోనూ బాగానే ఆడుతుంటాయి. కొన్ని పరిస్థితుల వల్ల థియేటర్లో సరిగ్గా ఆడలేదు. శశి సినిమాకు థియేటర్లో ఓపెనింగ్స్ వచ్చాయి. ఓటీటీలో బాగా ఆడింది. క్రేజీ ఫెల్లో సినిమా కూడా ఓటీటీలో బాగా ఆడింది.

 

నాన్న గారి సినిమాలైనా, పాటల్లో ఏదైనా రీమేక్ చేయాలని అనిపించిందా?

నాన్న గారి పాటను రీమేక్ చేయాలని ఉంది. ‘అసలేం గుర్తుకురాదు’ అనే పాటను రీమేక్ చేయాలని ఉంది. కానీ ఆ సిట్యువేషన్ పడాలి. అయితే ఆ సాంగ్‌ను రీమేక్ చేస్తే మళ్లీ కృష్ణవంశీ గారే తీయాలి.

 

ఫైనల్ గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి?

నేను ప్రస్తుతం లక్కీ మీడియాకు ఓ సినిమా చేస్తున్నాను. జీ5 కోసం చేసిన వెబ్ సిరీస్ షూటింగ్ అయిపోయింది. వచ్చే నెలలో ప్రమోషన్స్ మొదలుపెడతారు. సినిమాకు తక్కువ కాకుండా ఉంటుంది. మొదటి సీజన్‌లో ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు