“క్రేజీ ఫెలో” నుంచి ఆది సాయి కుమార్ స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్.!

Published on May 19, 2022 12:00 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ తన కెరీర్ లో హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్ లు పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలా లేటెస్ట్ గా అయితే ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనెర్ ని ప్లాన్ చేసాడు ఆ సినిమానే “క్రేజీ ఫెలో”. దర్శకుడు ఫణి కృష్ణ సిరికి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత రాధామోహన్ నిర్మాణం వహిస్తున్నారు. అయితే మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాలో ఆది ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

దీనిపై పోస్టర్ తో పాటు ఆది పై ఒక వీడియో టీజర్ ని కూడా రిలీజ్ చెయ్యగా ఈ సినిమాలో ఆది మాత్రం మరింత యంగ్ గా మరియు ఫ్రెష్ అండ్ స్టైలిష్ గా ఉన్నాడని చెప్పాలి. ఓవరాల్ గా అయితే ఈ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ ప్రామిసింగ్ గా ఉంది. ఇక ఈ సినిమాలో “సీటిమార్” ఫేమ్ దిగంగన సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండగా ధృవన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే తాను ఇచ్చిన నేపథ్య గీతం కూడా ఈ వీడియోలో బాగుంది.

సంబంధిత సమాచారం :