ఫీల్ గుడ్ మెలోడీగా “అఖండ” ఫస్ట్ సింగిల్..!

Published on Sep 18, 2021 7:31 pm IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా, తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్‌, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే తాజాగా చిత్ర బృందమ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేసింది. ‘అడిగా అడిగా’ అంటూ సాగే ఫీల్‌గుడ్‌ మెలోడి అందరిని ఆకట్టుకుంటుంది. కల్యాణ చక్రవర్తి ఈ పాటకు లిరిక్స్‌ అందించగా, ఎస్పీ చరణ్‌, శృతి ఆలపించారు. బాలయ్య మరియు ప్రగ్యా జైస్వాల్ మధ్య కనిపిస్తున్న విజువల్స్ కూడా బాగున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :