“ఆదిపురుష్” ఆల్బమ్ తో మరింత హైప్.!

Published on May 30, 2023 8:06 am IST


ఇప్పుడు పాన్ ఇండియా సినిమా వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రం “ఆదిపురుష్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ భారీ విజువల్స్ తో ఇపుడు నెక్స్ట్ లెవెల్ హైప్ తో అయితే వస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రం రిలీజ్ కి దగ్గర అవుతుండగా మేకర్స్ ఒకో సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు.

అయితే రీసెంట్ టైం లో ఓ సినిమాకి కావాల్సిన సెన్సేషనల్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ అయితే ఇపుడు ఆదిపురుష్ లో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. మొదటి సాంగ్ జై శ్రీరామ్ బిగ్గెస్ట్ హిట్ కాగా లేటెస్ట్ గా వచ్చిన రాం సీతా రాం సాంగ్ కూడా యునానిమస్ గా సూపర్ రెస్పాన్స్ ని అయితే తెచ్చుకుంది.

దీనితో ఈ చిత్రం ఆల్బమ్ కూడా సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ కానుంది అని అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో అయితే టోటల్ గ 5 పాటలు ఉన్నట్టు టాక్ ఉండగా మిగతావి కూడా ఎలా ఉంటాయో చూడాలి. అవి కూడా బాగున్నట్టు అయితే ఆదిపురుష్ మ్యూజికల్ గా కూడా భారీ హిట్ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం :