మోస్ట్ అవైటెడ్ మూవీ గా “ఆదిపురుష్”

Published on Jun 3, 2023 3:01 am IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాముడుగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు ఇండియా లో మోస్ట్ అవైటెడ్ మూవీ గా నిలిచింది.

ఆదిపురుష్ చిత్రం బుక్ మై షో లో 196 కే కి పైగా ఇంట్రెస్ట్ లతో టాప్ లో ఉంది. ఆ తర్వాత స్థానం లో సలార్, జవాన్ చిత్రాలు ఉన్నాయి. కృతి సనన్, సైఫ్ అలీఖాన్ లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :