నైజాంలో “ఆదిపురుష్” డే 2 సాలిడ్ వసూళ్లు.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మళ్ళీ తన మార్కెట్ రేంజ్ లో చేసి భారీ ఓపెనింగ్స్ లేటెస్ట్ సినిమానే “ఆదిపురుష్”. మరి దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ మాసివ్ విజువల్ ట్రీట్ అయితే డే కి రికార్డు ఓపెనింగ్స్ సాధించగా ఇక రెండో రోజు కూడా భారీ వసూళ్లు రిజిస్టర్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్పాయి.

ఇక మెయిన్ గా మొదటి నైజాంలో సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం రెండో రోజు కూడా సాలిడ్ వసూళ్లు నమోదు చేసినట్టుగా ట్రేడ్ చెప్తుంది. మరి లేటెస్ట్ పి ఆర్ నంబర్స్ ప్రకారం అయితే డే 2 కి నైజాంలో ఈ చిత్రం 7.8 కోట్ల మాసివ్ షేర్ ని రాబట్టిందట. దీనితో ఈ భారీ సినిమా చిత్రం అదిరే వసూళ్లు నమోదు చేసింది అని చెప్పాలి. దీనితో ఈ రెండు రోజుల్లో అయితే ఈ చిత్రం ఒక్క నైజాం నుంచే 21.48 కోట్లకి పైగా షేర్ అని రాబట్టేసింది. ఇక ఈ ఆదివారం వసూళ్లు కూడా గట్టిగానే ఉంటాయని చెప్పొచ్చు.

Exit mobile version