“ఆదిపురుష్” నుంచి ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన దర్శకుడు.!

Published on Apr 10, 2022 9:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమాల్లో బాలీవుడ్ దర్శకుడు అయినటువంటి ఓంరౌత్ తో చేసిన భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రామునిగా ప్రభాస్ నటించగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీత పాత్రలో నటించింది. అయితే ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ ఒక అప్డేట్ ఇస్తారని అభిమానులు ఆశించగా మళ్ళీ వారికి నిరాశే ఎదురైంది.

అయితే దానికి బదులుగా దర్శకుడు ఓంరౌత్ ఇంకో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని అయితే షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమా విషయంలో ఫాన్స్ చేసిన కొన్ని ఫాన్ ఎడిట్స్ నే ఒక వీడియో లా చేసి ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు అభిమానులకి ఈ రామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపాడు. అలాగే ఇందులో ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా వచ్చే ఏడాది జనవరిలోనే రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :