‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ టైం ఫిక్స్

Published on Jun 6, 2023 7:48 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అందాల నటి కృతి సనన్ ల కలయికలో ఓం రౌత్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ మైథలాజికల్ పాన్ ఇండియన్ మూవీ ఆదిపురుష్. ఈ మూవీలో ప్రభాస్ రాఘవగా కృతి సనన్ సీత గా నటిస్తుండగా సైఫ్ ఆలీ ఖాన్ లంకేశ్ పాత్రలో కనిపించనున్నారు. టి సిరీస్, రిట్రో ఫైల్స్ సంస్థల పై ఎంతో భారీ వ్యయంతో రూపొందుతున్న ఆదిపురుష్ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్రస్తుతం తిరుపతిలో గ్రాండ్ లెవెల్లో నిర్వహిస్తోంది యూనిట్.

ఇప్పటికే ఆదిపురుష్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి. ఇక నేడు ఈ మూవీ నుండి ఫైనల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్, తాజాగా ఆ ట్రైలర్ ని రాత్రి 9 గం. లకు యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మొత్తంగా అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న భారీ స్థాయిలో పలు భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :