డిజప్పాయింట్ మీద డిజప్పాయింట్ చేస్తున్న “ఆదిపురుష్” టీమ్?

Published on May 25, 2022 8:06 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో పాన్ ఇండియా లెవెల్లో అనేక అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న చిత్రం “ఆది పురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పక్కన పెడితే అసలు ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల్లోకి వెళ్తుంది అనే టాక్ కోసం మాట్లాడుకోవాలి.

ఈ సినిమా అనౌన్స్మెంట్ అలాగే రెండు సార్లు రిలీజ్ డేట్ లు అంతే వీటికి మించి ఇప్పటికి వచ్చి కనీసం ఫస్ట్ లుక్ కూడా రాలేదు. ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది అంటే.. రామాయణ ప్రత్యేక దినాలు రామ నవమి, హనుమాన్ జయంతి లాంటి రోజుల్లో ఏవన్నా మినిమం అప్డేట్స్ వేరే ఎవరైనా ఇస్తారు. కానీ ఈ సినిమా కి మాత్రం ఇలాంటి పర్వదినాలు వస్తున్నాయి వెళ్లిపోతున్నాయి.

కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీనితో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకి డిజప్పాయింట్ మీద డిజప్పాయింట్ ఎదురు అవుతుంది. ఇంకా సినిమా రిలీజ్ 6 నెలలు కూడా లేదు. ఇంకా ఫస్ట్ లుక్ కూడా రాని ఈ సినిమా ఈ గ్యాప్ లో ఎలా హైప్ ని తెచ్చుకుంటుందో ఎలాంటి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :