“ఆదిపురుష్”..ఈసారి నుంచి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటే బెటర్.!

“ఆదిపురుష్”..ఈసారి నుంచి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటే బెటర్.!

Published on May 30, 2023 3:55 PM IST


ఇప్పుడు పాన్ ఇండియా వీక్షకులు బిగ్ స్క్రీన్స్ పై విట్నెస్ చెయ్యాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “ఆదిపురుష్” అనే చెప్పాలి. ఈ సినిమా స్టార్ట్ చేసిన సమయంలో ఉన్న హైప్ ని మేకర్స్ టీజర్ వరకు కూడా అలాగే పట్టి ఉంచి తీసుకొచ్చారు. కానీ టీజర్ తర్వాత అంతా ఒక్కసారిగా మారిపోయింది.

అయితే ఈ భారీ నెగిటివ్ తర్వాత మేకర్స్ ఊహించని విధంగా బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. ఇండియన్ సినిమా నుంచి నెవర్ బిఫోర్ విజువల్స్ తో అయితే దర్శకుడు ఓంరౌత్ తన మాస్ చూపించాడు. అయితే అంతా బాగానే ఉంది సినిమా నుంచి సాంగ్స్ కూడా ఆడియెన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తున్నాయి.

కాకపోతే మేకర్స్ మరీ ఎక్కువ వీడియో నుంచి కొత్త విజువల్స్ ని రివీల్ చేసేస్తుండడం సినిమాపై ఆసక్తిని ఆడియెన్స్ ల=కి సస్పెన్స్ ఫ్యాక్టర్ ని తగ్గించేస్తుందని అని చెప్పాలి. నిన్న వచ్చిన రాం సీతా రాం సాంగ్ లోనే కీలమైన ఎమోషనల్ సీన్ ని చూపించేసారు. సాంగ్ లాస్ట్ లో తన సీతను రాముడు చేరుకున్నపుడు ఇద్దరి నడుమ సీన్ ఎంత కీలకం?

అలాంటి అపురూపమైన సీక్వెన్స్ ని సాంగ్ తో సింపుల్ గా రివీల్ చేసేసారు. మరి ఇలాంటి కీలమైన సీన్స్ ని బిగ్ స్క్రీన్ పై మొదటి సారి చూస్తే ఆడియెన్స్ ఫీల్ అయ్యే ఆ ఎమోషన్ గాని హై గాని నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఇలాంటి అంశాలు మేకర్స్ నెక్స్ట్ అప్డేట్స్ లో రిపీట్ చేయకుండా ఉంటేనే బెటర్ అనుకోవాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు