ప్రభాస్‌ తన ఆకృతిని మార్చుకున్నాడట !

Published on Apr 4, 2022 6:38 pm IST

ప్రభాస్ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో చేస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా “ఏ- ఆది పురుష్”. కాగా ‘ఆదిపురుష్‌’ సినిమా డైరెక్టర్ ఓం రౌత్‌ ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం కోసం ప్రభాస్‌ చాలా సవాళ్లను ఫేస్‌ చేశాడు. రాముడి పాత్రలో కనిపించడానికి ప్రభాస్‌ చాలా రకాలుగా కష్టపడ్డారు. ముఖ్యంగా విలువిద్యలో ప్రభాస్‌ శిక్షణ కూడా తీసుకున్నారు. పైగా విలుకారుల దేహదారుఢ్యం ‘వి’ షేప్ లో ఉంటుందని మనం చదివాం. అంటే భుజాలు విశాలంగా, నడుము భాగానికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది.

ప్రభాస్‌ తన ఆకృతిని ఇలాగే మార్చుకున్నారు. అలాగే, డైలాగ్స్ విషయంలో కూడా చాలా సాధన చేశారు. అందుకే ‘ఆదిపురుష్‌’గా ప్రభాస్‌ పర్‌ఫెక్ట్‌ యాప్ట్‌ అని చెబుతున్నాను’’ అంటూ ఓం రౌత్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కృతీ సనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్, అదే విధంగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. జనవరిలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

సంబంధిత సమాచారం :