ప్రభాస్ “ఆదిపురుష్” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Sep 27, 2021 12:30 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం కి సంబంధించిన తాజా అప్డేట్ ను చిత్ర యూనిట్ వెల్లడించడం జరిగింది. ఈ చిత్రం ను వచ్చే ఏడాది ఆగస్ట్ 11 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఒక పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో రావణాసురుడు పాత్ర లో సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా, కృతి సనన్ ప్రభాస్ సరసన సీత పాత్ర లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్ మరియు రెట్రో ఫైల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :