‘ఆదిపురుష్’ షూటింగ్‌పై ఓం రౌత్ ఆలోచన ఇదేనా?

Published on Oct 27, 2021 1:20 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నాడు. వీటిలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రం “ఆదిపురుష్”. ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 11న రిలీజ్ చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనోన్‌ నటిస్తుంది.

ఇప్పటికే రావణ పాత్రధారి సైఫ్ అలీఖాన్ షూటింగ్ పార్ట్, సీత పాత్రదారిణి కృతీ సనన్ షూటింగ్ పార్ట్‌ని పూర్తి చేసిన ఓమ్ రౌత్ ప్రస్తుతం రాముడి పాత్రధారి ప్రభాస్‌ షూటింగ్ పార్ట్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఓ పక్క గ్రాఫిక్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతూనే, మరోపక్క ప్రభాస్ షూటింగ్ పార్ట్‌ని నాన్ స్టాఫ్‌గా జరిపి వచ్చే నెలాఖరులోపు పూర్తి చేయాలని ఓం రౌత్ భావిస్తున్నాడట. ఈ విధంగా చేస్తేనే వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఓం రౌత్ అనుకుంటున్నాడట.

సంబంధిత సమాచారం :

More