యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ప్రీ సేల్స్?

Published on Jun 5, 2023 2:32 pm IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో, రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్, జూన్ 16న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కానుంది. ఈ చిత్రం USA బాక్సాఫీస్ కలెక్షన్‌కు సంబంధించి తాజా వార్త ఏమిటంటే, ప్రీ సేల్స్ జోరు కనిపిస్తోంది. USA ఏరియాలో 3700 టిక్కెట్లు అమ్ముడవడంతో ఇప్పటి వరకు అడ్వాన్స్ సేల్స్ నుండి 85కే డాలర్లను సంపాదించింది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ నోట్‌తో ప్రారంభమవుతుంది అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ ప్రీ సేల్స్ వచ్చే 10 రోజులలోపు బాగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ చిత్రం లో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :