“ఆదిపురుష్” ఈవెంట్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఊహించని స్టెప్ వైరల్.!

Published on Jun 3, 2023 10:01 pm IST

ప్రస్తుతం వరల్డ్ వైడ్ భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఇండియన్ సినిమా “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కి ఈ జూన్ 6న గ్రాండ్ గా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అయితే మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్ కోసం మేకర్స్ భారీ ప్లానింగ్లు కూడా ఆల్రెడీ చేస్తుండగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ లు అజయ్ అండ్ అతుల్ లు ఆల్రెడీ అదిరే వర్క్ ని అందించగా వీరిలో అతుల్ ఇప్పుడు ఈ చిత్రం గ్రాండ్ ఈవెంట్ కి ఏకంగా ముంబై నుంచి తిరుపతికి బైక్ పై జర్నీ చేస్తూ చేరుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట.

దీనితో తనకు తీసుకున్న ఊహించని స్టెప్ అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ ఈవెంట్ కి అయితే తాను చేరుకున్న తర్వాత తన సోదరుడు అజయ్ తో కలిసి ఈ సినిమా సెన్సేషనల్ చార్ట్ బస్టర్ సాంగ్ జై శ్రీరామ్ ని కలిసి ఆలపించనున్నాడట. మరి ముంబై లో అయితే అతుల్ ఈ జూన్ 3న స్టార్ట్ అయ్యి జూన్ 6న ఈవెంట్ డే కి తిరుపతి చేరుకొని వెంకన్న స్వామి ఆశీస్సులతో అయితే ఈ మహా ఈవెంట్ లో పాల్గొననున్నారట.

సంబంధిత సమాచారం :