ఈ ప్రముఖ సంస్థ కి “ఆదిపురుష్” ఓవర్సీస్ హక్కులు.!

ఈ ప్రముఖ సంస్థ కి “ఆదిపురుష్” ఓవర్సీస్ హక్కులు.!

Published on Nov 11, 2022 7:12 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా ఆది పురుష్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం రీసెంట్ గానే వాయిదా కూడా పడింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం ఆయితే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా చాలా గ్రాండ్ గా రిలీస్ కానున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పుడు ఈ సినిమా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరో అనేది తెలుస్తుంది. ఈ ఏడాదిలో పలు భారీ సినిమాలు హిట్ సినిమాలు రిలీస్ చేసినటువంటి సరిగమ సినిమాస్ వారు ఈ చిత్రాన్ని కూడా ఓవర్సీస్ అన్ని భాషల్లో కూడా రిలీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లోకూడా రిలీజ్ చేస్తారని రూమర్స్ ఉన్నాయి. మరి ఆ భాషలో కూడా సినిమా విడుదల అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు