ఆదిపురుష్ విడుదల సమ్మర్‌ కి వాయిదా ?

ఆదిపురుష్ విడుదల సమ్మర్‌ కి వాయిదా ?

Published on Oct 31, 2022 8:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం భారీ అంచనాల మధ్య భారీగా తెరకెక్కుతుంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా రాబోతుంది. ఇక ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఐతే, ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది అంటూ మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కాగా, తాజాగా ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి ఔట్ అయి, సమ్మర్‌ కి వాయిదా పడిందని ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఓ వార్త వైరల్ అవుతుంది.

దీనికి సంబంధించి త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది. ఇది నిజం అయితే, ప్రభాస్ అభిమానులకు నిరాశే. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో కృతీ సనన్, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్, అదే విధంగా లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు