“ఆదిపురుష్” ప్రమోషన్స్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయట.!

Published on Jun 2, 2022 7:02 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ గా ఉన్న భారీ సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ విజువల్, మైథాలాజికల్ వండర్ కోసం చాలా ఆసక్తికరంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ వచ్చే ఏడాదికి కన్ఫర్మ్ అవ్వగా..

లేటెస్ట్ గా ఈ సినిమాపై మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు బయటకు వచ్చాయి. వాటిలో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా ఒకటి. గత కొన్ని రోజులు కితం ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కాస్త హాట్ చర్చే సోషల్ మీడియాలో జరగ్గా దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మేకర్స్ అయితే ఈ వచ్చే అక్టోబర్ నుంచి మొదలు పెట్టే ప్లాన్ లో ఉన్నారట. మరి అక్కడ నుంచి ఈ భారీ సినిమా నుంచి నాన్ స్టాప్ గా అప్డేట్స్ ఉంటాయని చెప్పాలి.

సంబంధిత సమాచారం :