అద్భుతంగా “ఆదిపురుష్” మిగతా మూడు సాంగ్స్.!

Published on Jun 7, 2023 10:03 am IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా విజువల్ డ్రామా “ఆదిపురుష్” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తుండగా ఆదిపురుష్ సినిమాపై హైప్ ఇచ్చిన మరో అంశం ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ అనే చెప్పాలి.

మొదటగా రిలీజ్ చేసిన జై శ్రీరామ్ సాంగ్ అయితే వేరే లెవెల్ ట్రీట్ ఇవ్వగా దానితో ఈ చిత్రం పై మరిన్ని అంచనాలు నెలకొనగా నెక్స్ట్ అయితే రామ్ సీతా రామ్ సాంగ్ కూడా సూపర్ గా క్లిక్ అయ్యింది. అయితే ఇదిలా ఉండగా ఈ సాంగ్ తర్వాత మిగతా సాంగ్స్ లో ఒకటి శివోహం నిన్న లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు అయితే మేకర్స్ ఆదిపురుష్ టోటల్ ఆల్బమ్ జ్యూక్ బాక్స్ ని రిలీజ్ చేయగా ఇందులో మరో రెండు పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఈ జ్యూక్ బాక్స్ లో అయితే మరో బ్యూటిఫుల్ మెలోడీ సహా రామునికి సాయం చేసే వానర సైన్యంపై ఓ సాంగ్ ఉంది. ఇవి కూడా వినడానికి ఎంతో ఇంపుగా తెలుగు సాహిత్యంతో అనిపిస్తున్నాయి. ఇక ఈ భారీ సినిమా అయితే ఈ జూన్ 16న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఆదిపురుష్ టోటల్ సాంగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :