“ఆదిపురుష్” కి రిపేర్లు నిజమే..!

“ఆదిపురుష్” కి రిపేర్లు నిజమే..!

Published on Nov 6, 2022 5:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. మరి బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం అయితే వచ్చే ఏడాది జనవరి సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చెయ్యగా దీనితో ఈ చిత్రం రిలీజ్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే సినిమా టీజర్ వచ్చాక అంతా మారిపోయింది.

దీనితో సినిమా వాయిదా అని మళ్ళీ కొన్ని రిపేర్లు కూడా ఉన్నాయని పలు కామెంట్స్ అయితే గట్టిగా వినిపించాయి. అయితే దీనిపై మరింత క్లారిటీ తెలుస్తుంది. ఆదిపురుష్ కి వి ఎఫ్ ఎక్స్ పరంగా మళ్ళీ వర్క్స్ స్టార్ట్ చేయనుండడం నిజమేనట. ఈసారి చాలా అంశాల్లో గ్రాఫిక్స్ ని రియలిస్టిక్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. దీనితో అయితే ఆదిపురుష్ వాయిదా కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు