‘ఆదిపురుష్’ 3డి టీజర్ రిలీజ్ కి ప్లానింగ్ …. ?

‘ఆదిపురుష్’ 3డి టీజర్ రిలీజ్ కి ప్లానింగ్ …. ?

Published on Oct 6, 2022 1:00 AM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ఈ మూవీ లో ప్రభాస్ రాఘవ గా కనిపించనుండగా సీతగా కృతి సనన్, లంకేశ్ గా సైఫ్ ఆలీ ఖాన్ నటించారు. టి సిరీస్, రిట్రో ఫైల్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఆదిపురుష్ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన అఫీషియల్ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా మరికొంత క్వాలిటీ మెయింటెయిన్ చేసి ఉంటె బాగుండేది అనే అభిప్రాయాలు కొంత వినబడ్డాయి.

దానితో కొంత ఆలోచన చేసిన ఆదిపురుష్ మూవీ టీమ్, అతి త్వరలో టీజర్ ని 3డి వర్షన్ లో దేశంలోని ఎంపిక చేసిన పలు ముఖ్య ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ 3డి టీజర్ హైదరాబాద్ ప్రదర్శనలో హీరో ప్రభాస్, దర్శకుడు ఓం రౌత్ పాల్గొననున్నారని, త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2023 సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న గ్రాండ్ లెవెల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు