ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అదిరే అభి “వైట్ పేపర్” మూవీ..!

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అదిరే అభి “వైట్ పేపర్” మూవీ..!

Published on Sep 25, 2021 1:00 AM IST


ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా తన నట జీవితాన్ని ప్రారంభించిన అభినయ కృష్ణ పలు చిత్రాల్లో నటుడిగా, కమెడియన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ కార్యక్రమంలో అదిరిపోయే కామెడీ పెర్ఫార్మెన్స్ తో అదిరే అభిగా ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడు వైట్ పేపర్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. శివ దర్శకత్వంలో జి.ఎస్.కె ప్రొడక్షన్స్ పతాకంపై గ్రందే శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే “వైట్ పేపర్” చిత్రాన్ని కేవలం 9 గంటల 51 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశారు. దీంతో ఈ సినిమాను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అరుదైన చిత్రంగా సత్కరించారు. నేడు అదిరే అభి పుట్టిన రోజు సందర్భంగా “వైట్ పేపర్” టైటిల్ లుక్ ను మనో, ఇంద్రజా, అనసూయ చేతుల మీదుగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా మనో మాట్లాడుతూ “వైవిధ్య కథనాలు ఎంచుకోవడంలో అభి ముందు ఉంటాడని, ఇప్పుడు ఈ వైట్ పేపర్ సినిమాని కూడా డిఫరెంట్‌గా చేసాడని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు.

ఇంద్రజా మాట్లాడుతూ “సామాన్యంగా నటి నటులు తమ పాత్రలు చేస్తున్నప్పుడు చాలా కష్టపడుతారని, ఒక్క రోజులో అది కూడా 9 గంటల 51 నిమిషాల టైమ్ టార్గెట్ పెట్టుకొని సినిమా తియ్యడం అంటే అభి ఎంత హోమ్ వర్క్స్ చేసి ఉంటాడో చెప్పడం కష్టమని, అభి ఇలాంటి అవార్డ్స్ మరెన్నో అందుకోవాలని అన్నారు.

అనసూయ మాట్లాడుతూ అభిని ఎప్పటి నుంచో చూస్తున్నానని, అభి ఏదైనా చేయాలి అనుకుంటే చాలా కొత్తదనం ఉండేలా చూసుకుంటాడని, ఒక నటుడిగా తన ప్రతిభ మన అందరికి తెలుసని, ఇప్పుడు వైట్ పేపర్ సినిమాలో హీరోగా చేయడమే కాకుండా, ఆ సినిమాని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నిలిచేలా చేయడం చాలా సంతోషంగా ఉందని, వారి టీం అందరికి శుభాకాంక్షలు తెలియచేసింది.

హీరో అభి మాట్లాడుతూ “కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కేవలం 9 గంటల 51 నిమిషాల సమయంలోనే సినిమా షూటింగ్ అంత పూర్తి చేయాలి అన్నప్పుడు దర్శకుడి డెడికేషన్ నచ్చిందని, ఈ చిత్రానికి విడుదల ముందే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావటం, మా మనో గారు, ఇంద్రజా గారు, అనసూయ గారు మా చిత్రం టైటిల్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉందని అన్నాడు.

దర్శకుడు శివ మాట్లాడుతూ సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమాలో అభి హీరోగా నటించారని, తను లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు, మాకు అవార్డు కూడా వచ్చేది కాదేమో, అభి అన్న ఇచ్చిన సపోర్ట్ కారణంగానే 9 గంటల 51 నిమిషాలలో ఈ చిత్రాన్ని పూర్తి చేసామని, అందరూ ఒక్క రోజులో ఎలా సినిమా తీయగలవు అన్నారు, అభి అన్న సపోర్ట్ తో, టీం సహకారంతో సినిమా తీయడం అవార్డు కొట్టడం, అలానే అభి అన్న పుట్టినరోజు సందర్భంగా ఇలా టైటిల్ లుక్ రివిల్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు