ఆ లెజెండ్ బయోపిక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా అంటున్న అదితి రావ్ హైదరి!

Published on Oct 12, 2021 12:08 am IST


అదితి రావ్ హైదరి తన కొత్త చిత్రం మహా సముద్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ చిత్రం ఈ నెల 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం లో లీడ్ రోల్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అదితి రావ్ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

అయితే బయోపిక్ ఎవరిదైనా చేసేందుకు సిద్దం గా ఉన్నారా అని అడగగా, లెజెండరీ క్లాసికల్ సింగర్ అయిన ఎం ఎస్ సుబ్బ లక్ష్మీ బయోపిక్ చేయడానికి ఇష్టపడతాను అని వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అదితి రావ్ హైదరి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :