ఆదిత్య ధర్‌ నీకు సెల్యూట్‌ – కంగనా రనౌత్

Kangana Ranaut

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. పైగా ఆమె సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఐతే, తాజాగా ఆదిత్యధర్‌ చిత్రపరిశ్రమలోకి రావాలనే ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు అంటూ ఆయనపై కంగనా ప్రశంసల వర్షం కురిపించింది. సహజంగా విమర్శలు చేసే అలవాటు ఉన్న కంగనా.. ఇలా ప్రశంసలు చేయడంతో.. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ కంగనా ఏం మాట్లాడింది అంటే.. ‘‘ధురంధర్‌’ విజయంలో గొప్ప విషయం ఏమిటంటే ఆదిత్య ధర్‌ దర్శకుడిగా స్టార్‌ డమ్ సంపాదించుకున్నారు. హాలీవుడ్‌ స్టార్‌ దర్శకులు ఎల్లప్పుడూ నటుల కంటే గొప్పవారు. కానీ, మనం మన దర్శకనిర్మాతలకు ఎప్పుడూ తగినంత గౌరవం, గుర్తింపు ఇవ్వము. అందుకే చాలామంది నటులు కావాలని మాత్రమే కోరుకుంటారు. ఇప్పుడు ఇక్కడ హీరోల కన్నా ఎక్కువగా వెలిగిపోతున్న ఒక సూపర్‌ స్టార్‌ దర్శకనిర్మాత ఉన్నారు. సెల్యూట్‌ ఆదిత్య ధర్‌’’ అని తన పోస్ట్‌లో కంగనా రాసుకొచ్చింది.

Exit mobile version