మన తెలుగు దర్శకులు, నటీనటులు ఈ మధ్య కొత్త ప్రయోగాలకు తావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పలు ప్రయోగాత్మక చిత్రాలు రాగా ఇప్పుడు ఇంకో కొత్త ప్రయోగం జరగనుంది. అదేమిటంటే సినిమా మొత్తం ఒకే ఒక్క పాత్ర మీద నడవడం. ఏంటి సినిమా మొత్తం ఒక్క పాత్రే ఉండటమేటి, అది సాధ్యమేనా అని సందేహపడుతున్నారు కదూ కానీ ‘లాహిరి లాహిరి లాహిరి’ లో ఫేమ్ ఆదిత్య ఓం సాధ్యం చేసి చుపిస్తానంటున్నాడు.
అవును ఆయన తర్వాతి సినిమా మొత్తం ఆయనొక్కడే ఉండనున్నాడు. ఎమినెంట్ 5 ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ సినిమాను రాఘవ తిరువాయిపాటి డైరెక్ట్ చేయనున్నాడు. ఈయన గతంలో ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఫిబ్రవరి నెలఖాహారు నుండి మొదలవ్వబోయే ఈ చిత్రానికి మధుసూదన్ కోట సినిమాటోగ్రఫీ చేయనుండగా రాకేష్ గోవర్ధన్ గిరి మ్యూజిక్ అందించనున్నారు.
