IMDB టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో అడివి శేష్ బ్లాక్ బస్టర్ మూవీ

IMDB టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో అడివి శేష్ బ్లాక్ బస్టర్ మూవీ

Published on Dec 15, 2022 1:41 AM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం విభిన్న కథల సినిమాలతో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ముందుకి వచ్చి తన ఆకట్టుకునే నటన తో మంచి పేరు సొంతం చేసుకుంటూ దూసుకెళ్తున్న యువ నటుడు అడివిశేష్. ఇక ఇటీవల శైలేష్ కొలను దర్శకత్వంలో నాచురల్ స్టార్ నిర్మించిన హిట్ 2 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు శేష్. అయితే ఈ ఏడాది మే లో భారీ పాన్ ఇండియన్ పేట్రియాటిక్ యాక్షన్ ఎమోషనల్ మూవీ మేజర్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన అడివి శేష్ దానితో కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టారు.

ముంబై ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీలో మేజర్ సందీప్ పాత్రలో తన సహజ నటన తో ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు అడివి శేష్. అలానే ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని భాషల్లో పెద్ద విజయం అందుకుంది. కాగా విషయం ఏమిటంటే, ఈ ఏడాది రిలీజ్ అయిన ఇండియన్ సినిమాల్లో ప్రముఖ సంస్థ IMDB వారి టాప్ 10 పాపులర్ మూవీస్ లిస్ట్ లో మేజర్ మూవీ నిలిచింది. దానితో మేజర్ మూవీ మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తూ తమ సోషల్ హ్యాండిల్స్ ద్వారా మూవీని ఆదరించిన ఆడియన్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. కాగా IMDB వారి టాప్ మోస్ట్ పాపులర్ మూవీస్ లో మన తెలుగు నుండి దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ తో పాటు హను రాఘవపూడి తీసిన సీతారామం మూవీ కూడా చోటు దక్కించుకున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు