“క్షణం” నుంచి “మేజర్” వరకు శేష్ వరుస విజయాలు.!

Published on Jun 26, 2022 2:00 pm IST


మన టాలీవుడ్ సినిమా దగ్గర ఒక్కో హీరో నుంచి ఒక్కో తరహా సినిమాలు అని కొన్ని జానర్స్ ఆడియెన్స్ కి ట్రీట్ గా ఉంటాయని ఒక బలమైన నమ్మకం ఉంది. అలాంటి అతి తక్కువ మంది హీరోస్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ కూడా ఒకడు. అయితే శేష్ తన ఫస్ట్ సినిమా “క్షణం” తోనే టాలీవుడ్ ఆడియెన్స్ కి ఒక షాకింగ్ సర్ప్రైజ్ హిట్ ని అందులో ముఖ్యాంగా ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ని తన రైటింగ్ మరియు టేకింగ్ తో ఇచ్చాడు.

మన తెలుగులోనే ఇలాంటి సినిమా తీసారా అన్న భావన అప్పట్లో చాలా మందికి కలిగింది. అక్కడ నుంచి శేష్ హీరోగా చేసిన ప్రతి సినిమా ఒకోటి ఒకో ట్రీట్ అని చెప్పాలి. అమితుమీ తో తాను కామెడీ తరహా సినిమాలు కూడా చేయగలడు అని ప్రూవ్ చేసి మళ్ళీ “ఎవరు”, “గూఢచారి” లాంటి సినిమాలతో సాలిడ్ హిట్స్ ని అందుకున్నాడు. వీటిలో గూఢచారి అయితే హాలీవుడ్ లెవెల్ విజువల్స్ ని అతి తక్కువ బడ్జెట్ తో చూపించడం ఆసక్తిగా మారింది.

ఇలా వరుస విజయాలు సాధిస్తూ శేష్ ఫైనల్ గా ఇప్పుడు “మేజర్” అనే ఎమోషనల్ యాక్షన్ డ్రామాని చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకి ఏకంగా 20 కోట్ల లాభం వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో ఇలా క్షణం నుంచి మేజర్ వరకు డిఫరెంట్ సినిమాలతో ట్రీట్ ఇస్తూ హిట్ అందుకున్న హీరోగా శేష్ అయితే నిలిచాడని చెప్పాలి. మరి ముందు రోజుల్లో కూడా శేష్ నుంచి ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం :