‘హిట్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్

‘హిట్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ, డేట్ ఫిక్స్

Published on Nov 24, 2022 10:30 PM IST


అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ సస్పెన్స్ ఎంటర్టైనర్ మూవీ హిట్ 2 ది సెకండ్ కేస్. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని తో కలిసి ప్రశాంతి తిపిర్నేని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో అడవిశేష్, కృష్ణ దేవ్ అలియాస్ కేడి పాత్ర చేస్తుండగా మణికందన్ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇక ఇప్పటికే హిట్ 2 నుండి రిలీజ్ అయిన ఉరికే ఉరికే సాంగ్ తో పాటు టీజర్, ట్రైలర్ అన్ని కూడా మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నవంబర్ 28న హైదరాబాద్ ఫిలిం నగర్ లోని జెఆర్సీ కన్వేషన్ సెంటర్ లో సాయంత్రం 6 గంటల నుండి ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. కాగా ఈ మూవీని డిసెంబర్ 2 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు