డబుల్ హ్యాట్రిక్ ‘హిట్’ లతో అడివి శేష్.!

డబుల్ హ్యాట్రిక్ ‘హిట్’ లతో అడివి శేష్.!

Published on Dec 3, 2022 11:09 AM IST

టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఓ ప్రత్యేకతని తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు తక్కువ మందే ఉంటే వారిలో ప్రామిసింగ్ కంటెంట్ తో ఎప్పటికప్పుడు కొత్త ట్రీట్ ఇచ్చే అడివి శేష్ కూడా ఒకడు. మరి శేష్ హీరోగా కేవలం థ్రిల్లర్ సినిమాలు మాత్రమే కాకుండా పలు ఎంటర్టైనింగ్ రోల్స్ కూడా చేసాడు. ఇక లేటెస్ట్ గా అయితే తనకి ఎక్కువగా చూడడానికి ఇష్టపడే థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లోనే తీసిన “హిట్ 2” తో అయితే తన కెరీర్ లో డబుల్ హ్యాట్రిక్ “హిట్” లను తాను సొంతం చేసుకున్నాడు.

హీరోగా తాను చేసిన గత ఆరు సినిమాలు వరుస విజయాలు కావడం ఇప్పుడు విశేషంగా మారింది. తన ఎపిక్ థ్రిల్లర్ ఫస్ట్ హిట్ చిత్రం “క్షణం” నుంచి ఇప్పుడు “హిట్ 2” తో ఆరు విజయాలు అందుకున్నాడు. క్షణం తర్వాత అమీ తుమీ డీసెంట్ హిట్ కాగా తర్వాత గూఢచారి, అలాగే ఎవరు అలాగే మేజర్ ఇప్పుడు హిట్ చిత్రాలతో శేష్ డబుల్ హ్యాట్రిక్ అందుకొని టాలీవుడ్ లో సెటిల్డ్ గా కొనసాగుతున్నాడు. ఇక నెక్స్ట్ కూడా తన నుంచి సాలిడ్ లైనప్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు