వైజాగ్ లో “మేజర్” ప్రీమియర్ పై అడివి శేష్ కీలక నిర్ణయం…ఇది నిజంగా స్పెషల్ మూమెంట్!

Published on May 29, 2022 2:12 pm IST


అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా జూన్ 3 వ తేదీన భారీగా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం ను ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షో లు వేయడం జరిగింది. వీటికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని వైజాగ్ లో ప్రీమియర్ షో కి హీరో అడివి శేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ షో కి టికెట్ లను బుక్ చేసుకున్న వారికి డబ్బులు వెనక్కి ఇవ్వడం జరిగింది. అంతేకాక టికెట్స్ ను బుక్ చేసుకున్న వారికి ఉచితంగా చూసేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది నిజంగా స్పెషల్ మూమెంట్ అని చెప్పాలి.

ఈ షో అనంతరం ప్రీ రిలీజ్ వేడుక కి చిత్ర యూనిట్ ప్లాన్ చేయడం జరిగింది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లోని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ లేడీ లీడ్ రోల్స్ లో నటించారు.

సంబంధిత సమాచారం :