సెన్సార్ కంప్లీట్ చేసుకున్న అడివి శేష్ “మేజర్”..!

Published on May 25, 2022 2:02 am IST

అడవి శేషు హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “మేజర్”. ముంబై ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరక్కించారు. జి.ఎమ్‌.బి ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ, సాయి మంజ్రేకర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరక్కించిన ఈ చిత్రాన్ని జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ని పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్‌ను సెన్సార్ బోర్డ్ ప్రశంసిచినట్లుగా చిత్ర బృందం పేర్కొంది. అంతేకాదు ఈ సినిమా చివరిలో సెన్సార్‌ బోర్డు సభ్యులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చి సందీప్‌ ఉన్నికృష్ణన్‌కు సెల్యూట్‌ చేసినట్లు సమాచారం. అనంతరం సెన్సార్ బోర్డ్ సభ్యులు అడివి శేష్ యాక్టింగ్‌కు ప్రత్యేక అభినందనులు తెలిపారట.

సంబంధిత సమాచారం :