సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి “మేజర్” టీం కి స్పెషల్ కంగ్రాట్స్.!

Published on Jun 21, 2022 1:00 pm IST


లేటెస్ట్ గా మన టాలీవుడ్ దగ్గర వచ్చిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా నటించిన చిత్రం “మేజర్” కూడా ఒకటి. మంచి అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం చిత్ర యూనిట్ కోరుకున్న రియల్ సక్సెస్ ని అందుకుందని చెప్పాలి. ఓ పక్క వసూళ్లతో పాటుగా చిత్రానికి అనేక మంది ప్రముఖులు నుంచి అపారమైన గౌరవం మరియు గుర్తింపులు ఈ చిత్రానికి చిత్ర యూనిట్ కి అందాయి.

అయితే తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మేజర్ చిత్ర యూనిట్ ని అభినందించడం ఆసక్తిగా మారింది. హీరో అడివి శేష్ సహా చిత్ర యూనిట్ మరియు తన తల్లి అంకుల్ తో శేష్ సీఎం ని కలవడానికి వెళ్లగా ఆయన శేష్ కి శాలువా కప్పి ఒక వెండి కాయిన్ ని ఇలాంటి గొప్ప సినిమాని తీసినందుకు బహుకరించి సత్కరించారు. దీనితో శేష్ ఈ విషయాన్ని ఆనందంగా వ్యక్తం చేస్తూ షేర్ చేసాడు.

సంబంధిత సమాచారం :