ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన శేష్ “మేజర్” చిత్రం..!

Published on Jul 3, 2022 7:26 am IST


టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మరో యంగ్ నటి సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా దర్శకుడు శశి కిరణ్ తిక్క కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ హిట్ చిత్రం “మేజర్”. ముంబై దాడుల్లో ఉగ్రవాదులు తో వీరోచిత పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ గా మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి అందించారు.

మరి ఈ చిత్రంతో అడివి శేష్ అండ్ టీం మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా భారీ లాభాలు అందుకుంది. అలాగే ఫైనల్ గా అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ యాల్ నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయగా ఈరోజు నుంచి ఈ చిత్రం అందులో తెలుగు, మలయాళ మరియు హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి అప్పుడు ఈ ఎమోషనల్ హిట్ ని గాని మిస్ అయితే ఈసారి చూడొచ్చు.

సంబంధిత సమాచారం :