అకీరా కి థాంక్స్ తెలిపిన అడివి శేష్..!

Published on Jun 16, 2022 11:00 pm IST

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన మేజర్ చిత్రం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోన్న ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది. తాజాగా ఈ చిత్రంలోని హృదయమా అనే సాంగ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అయిన అకీరా పియానో తో అందంగా ట్యూన్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ను హీరో అడివి శేష్ కి పంపించడం తో సంతోషం వ్యక్తం చేశారు.

హార్ట్ ఫుల్ గా ఉంది. లవ్ యూ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక మేజర్ చిత్రానికి సంగీతం అందించిన శ్రీ చరణ్ పాకాల ను ట్యాగ్ చేస్తూ, ఒకసారి చూడండి అంటూ చెప్పుకొచ్చారు. అకీరా మార్షల్ ఆర్ట్స్ తో పాటుగా, మ్యూజిక్ లో సైతం ప్రావీణ్యం సంపాదించారు. జూనియర్ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంటున్న అకీరా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :