ఆరోజు పంజా ఈరోజు మేజర్…పవన్ కి అడివి శేష్ థాంక్స్!

Published on Jun 12, 2022 7:21 pm IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన మేజర్ చిత్రం పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు సినిమా పై తమ అభిమానం చూపుతున్నారు. ఈ చిత్రం పై టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయినందుకు గానూ, హీరో అడివి శేష్ సోషల్ మీడియా వేదిక గా ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

డియర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నా గుండె నిండుగా ఉంది. మీరు టూర్ బిజీ ఉండే సరికి చూసే టైమ్ ఉందా అని అనుకున్నా, మీ నోట్ నన్ను నిజంగా హత్తుకుంది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ నే నాకు సర్వస్వం. ఆరోజు పంజా ఈరోజు మేజర్. మీ కృపకు నిజంగా కృతజ్ఞతలు. ఇంకా ఎన్నో చెప్పాలి. నేను ఫోన్ కోసం వాటిని సేవ్ చేస్తాను అంటూ ఎమోషనల్ అయ్యారు శేష్. హృదయపూర్వక కృతజ్ఞతలు సర్, థాంక్ యూ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :