అడివి శేష్ ఆరోగ్యం పై తాజా సమాచారం!

Published on Sep 20, 2021 2:50 pm IST


సినీ పరిశ్రమ లో అడివి శేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోల్లో అడివి శేష్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు మేజర్ సినిమా తో అడివి శేష్ సిద్దం అవుతున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే అడివి శేష్ కి గతవారం డెంగ్యూ సోకినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. బ్లడ్ ప్లేట్ లెట్స్ అకస్మాత్తు గా పడిపోవడం తో సెప్టెంబర్ 18 వ తేదీన ఆసుపత్రి లో చేరడం జరిగింది. అతను ఆరోగ్య పరిస్తితి పై వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తుంది. ఇందుకు సంబంధించిన ఏదైనా వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అతను త్వరగా కోలుకోవాలని ప్రేక్షకులు, అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :