టైమ్ ఫిక్స్ చేసుకున్న అడివి శేష్ “హిట్2” టీజర్!

టైమ్ ఫిక్స్ చేసుకున్న అడివి శేష్ “హిట్2” టీజర్!

Published on Nov 2, 2022 1:40 PM IST

టాలీవుడ్ యాక్టర్ అడివి శేష్ హిట్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శైలేష్ కొలను రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్ రేపు విడుదల కానుందని మేము ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజా సమాచారం ఏమిటంటే, టీజర్ రేపు ఉదయం 11:07 గంటలకు డిజిటల్ గా విడుదల కానుంది.

అదే సమయంలో రేపు హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో టీజర్‌ లాంచ్‌ కార్యక్రమం జరగనుంది. టీమ్ మొత్తం కూడా ఈవెంట్‌ కి హాజరు కానుంది. ఈ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో రావు రమేష్, శ్రీకాంత్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రసాద్ తిపిరనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్ స్టీవర్ట్ ఎడూరి HIT 2 చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఈ సినిమా డిసెంబర్ 2, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు