హిట్2 ట్రైలర్ రిలీజ్ కి రెడీ!

హిట్2 ట్రైలర్ రిలీజ్ కి రెడీ!

Published on Nov 22, 2022 12:43 AM IST


అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కుతున్న థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్ టైనర్ హిట్ 2. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిరినేని మరియు నాని లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్రం కు సంబందించిన ట్రైలర్ రిలీజ్ పై చిత్ర యూనిట్ మరో అప్డేట్ ను ఇచ్చింది. ఈ చిత్రం ట్రైలర్ ను నవంబర్ 23, 2022 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం హీరో నాని, అడివి శేష్ లు ఉన్న సరదా వీడియో ను విడుదల చేసారు. వీడియో చూస్తుంటే కంటెంట్ పై ఇద్దరికీ కూడా బాగా నమ్మకం ఉన్నట్లు తెలుస్తోంది టైమ్ ను ఫిక్స్ చేసింది. ఈ చిత్రానికి ఎంఎం.శ్రీలేఖ మరియు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, జాన్ స్టీవర్ట్ ఎడురి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. డిసెంబర్ 2, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు