అడివి శేష్ “హిట్ 2” ట్రైలర్ కి టైమ్ ఫిక్స్!

అడివి శేష్ “హిట్ 2” ట్రైలర్ కి టైమ్ ఫిక్స్!

Published on Nov 22, 2022 2:00 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన హిట్ 2 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించేందుకు నాని, అడివి శేష్‌లతో కూడిన వీడియో నిన్న విడుదలైంది.

ఈరోజు, మేకర్స్ విడుదల సమయాన్ని వెల్లడించారు. రేపు ఉదయం 11:07 గంటలకు ట్రైలర్ విడుదల కానుంది. రావు రమేష్, కోమలీ ప్రసాద్, శ్రీకాంత్ మాగంటి తదితరులు కూడా నటిస్తున్న ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు