దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అడివి శేష్ “మేజర్”

Published on Jun 3, 2022 12:00 pm IST


అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లోని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం ను ప్రీమియర్స్ రూపం లో ప్రదర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. మొత్తం 88 ప్రీమియర్ లు సోల్డ్ ఔట్ అవ్వడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఇది ఈ చిత్రానికి కేవలం మొదలు మాత్రమే అని తెలుస్తుంది.

సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో శోభిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

సంబంధిత సమాచారం :