పవన్ కళ్యాణ్ కోసం అడివి శేష్ “మేజర్” స్పెషల్ షో!

Published on May 26, 2022 12:30 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన రాబోయే చిత్రం మేజర్‌తో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించారు. స్టార్ యాక్టర్ పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్ గా మేజర్ చిత్రం ను ఏర్పాటు చేస్తానని అడివి శేష్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయమని ఒక అభిమాని అడిగిన దానికి హీరో అడివి శేష్ “పక్కా” అంటూ చెప్పుకొచ్చారు. అడివి శేష్ పంజాలో పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. మేజర్ బయోగ్రాఫికల్ మూవీలో శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్పెషల్ ప్రీమియర్స్‌లో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన మేజర్ జూన్ 3, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :