అడివి శేష్ “మేజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మామూలుగా ప్లాన్ చేయలేదుగా!

Published on May 27, 2022 10:10 pm IST


అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ చిత్రం ను మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం లోని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ను జూన్ 3 వ తేదీన థియేటర్ల లో భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ మేరకు అందుకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే ప్రీమియర్ షో ను ఏర్పాటు చేసి పాజిటివ్ టాక్ తో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ను చాలా డేరింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకులు మే 29 వ తేదీన వైజాగ్ లో సినిమా చూసిన తర్వాత ప్రీ రిలీజ్ వేడుక ను నిర్వహించడం విశేషం. అయితే ఇది మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ చిత్రం అంటూ హీరో అడివి శేష్ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :