అమీర్ తర్వాత ఇద్దరు స్టార్స్ సినిమాలు టార్గెట్..!

అమీర్ తర్వాత ఇద్దరు స్టార్స్ సినిమాలు టార్గెట్..!

Published on Aug 14, 2022 11:31 PM IST


ఇప్పుడు బాలీవుడ్ ఆడియెన్స్ లో అక్కడి హీరోల కొందరి సినిమాలు పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాము. అయితే గత కొంత కాలం నుంచి కూడా ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా నెగిటివ్ ట్రెండ్ కామన్ గానే జరుగుతుంది. కానీ ఈసారి ఇది కాస్త సీరియస్ గా మారిందని చెప్పాలి. రీసెంట్ గా వచ్చిన అమీర్ ఖాన్ మోస్ట్ అవైటెడ్ సినిమా “లాల్ సింగ్ చడ్డా” ని బాయ్ కాట్ చెయ్యాలంటూ నెగిటివ్ ట్రెండ్ చేయగా ఈ సినిమాకి నిజంగానే హిందీ ప్రేక్షకులు షాకింగ్ ఓపెనింగ్స్ ఇచ్చారు.

ఇక ఇప్పుడు అమీర్ తర్వాత మరో ఇద్దరి బిగ్ స్టార్స్ అయినటువంటి హృతిక్ రోషన్ మరియు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ లు నటిస్తున్న భారీ సినిమాలు ”విక్రమ్ వేద” అలాగే “పఠాన్” సినిమాలపై నెగిటివ్ ట్రెండ్స్ స్టార్ట్ చేయడంతో ఇది కాస్త సీరియస్ అంశంగా మారింది. దీనితో ఈ సినిమాలకి కూడా అమీర్ సినిమాకి తగిలిన రేంజ్ సెగ తగులుతుందా అన్నట్టు హిందీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి రానున్న రోజుల్లో వీటి పరిస్థితి ఏంటో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు