‘బాహుబలి’ తర్వాత ఆ ఛాన్స్ ‘అర్జున్ రెడ్డి’ కే దక్కింది !


ఇంతకు ముందు ఎవరైనా పెద్ద హీరోల సినిమా విడుదలవుతుందంటే ముందురోజు రాత్రే ప్రీమియర్ల రూపంలో సినిమాను ప్రదర్శించేవారు నిర్మాతలు. కానీ ఈ సంవత్సరం జనవరి తర్వాత విడుదలైన సినిమాల్లో ఒక్క ‘బాహుబలి-2’ కి తప్ప వేటికీ కూడా ప్రీమియర్లు ప్రదర్శించేలేదు. ప్రభుత్వం కూడా పెద్ద హీరోల సినిమాలు వేటికీ ప్రీమియర్లు వేసేందుకు అనుమతులు ఇవ్వలేదు.

అలాంటిది ఇప్పుడు విజయదేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు మాత్రం ప్రీమియర్లు వేసుకునే అవకాశం దక్కింది. 25న సినిమా రిలీజ్ కానుండగా 24 రాత్రి హైదరాబాద్ నగరంలోని పలు థియేటర్లలో ప్రీమియర్లను ప్లాన్ చేశారు. ఇప్పటికేఅడ్వాంస్ బుకింగ్స్ కూడా మొదలై దాదాపు అన్ని స్క్రీంలు ఫుల్ అయిపోవడం విశేషం. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రణయ్ వంగ నిర్మించారు.